పల్నాడు జిల్లా, వినుకొండ,నకరికల్లు,రొంపిచర్ల,ఐనవోలు,కురిచేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్ మరియు చోరి సొత్తు రికవరీ గురించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. నలుగురు ముద్దాయిలను, వినుకొండ పోలీస్ స్టేషన్ SI D. చెన్నకేశవులు , SI G. రాజ్యలక్ష్మి మరియు తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి చోరి సొత్తు బంగారం 338 గ్రాములు (42 సెవర్లు), వెండి 333 గ్రాములు, నగదు రూ. 1,68,000/- మరియు 4 మోటార్ సైకిల్స్ లను రికవరీ చేసినారు. ఈ దొంగతనాల కేసుల్లో ముద్దాయిలను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన వినుకొండ సీఐ బృందాన్ని, CCS సీఐ విజయ కృష్ణ బృందాన్ని, సాంకేతిక సహాయం అందించిన బృందాన్ని నగదు రివార్డులతో ఎస్పీ అభినందించినారు.