మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు కేంద్రం భారీగా బలగాలను పంపింది. ఈ రెండు రాష్ట్రాల్లో హింస, అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక చేసింది. అందుకే 15 బెటాలియన్ల ర్యాపిడ్ ఫోర్స్ ను కేంద్రం సిద్ధం చేసింది. 20వేల మందికిపైగా జవాన్లను ఎయిర్ లిఫ్టుకు సన్నద్ధం చేసింది. సైన్యానికి ఆయుధాలను అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఉన్నతాధికారులకు తెలియజేసింది.