మినుముల్లో ఉండే పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రకరకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుందని అంటున్నారు.మినుముల్లో కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలు తగ్గడానికి మినుములు మంచి ఆహారంగా సహాయపడతాయి. మినుములు మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా తొలగిస్తాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుములతో చేసిన వంటకాలను తినవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు.