రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి జూలై 5 వరకు బీఈడీ మూడవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షలు విభాగం డీన్ విశ్వనాథ్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో మొత్తం 3229 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. కాగా పరీక్షలను పకడ్బందీగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa