భారత రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు బుధవారం ముగిసింది. మొత్తం 115 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటికే 28 నామినేషన్లను తిరస్కరించారు. గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తారు. వాటిలో రూల్స్ ప్రకారం లేని వాటిని తిరస్కరిస్తారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రమే బరిలో మిగిలే ఛాన్సుంది.