శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం జరిగిన ఆటో ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆటోపై హైటెన్షన్ విద్యుత్తు తీగ పడిన ఘటనలో 8 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా,మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విదేశాల నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బాధితుల కుటుంబాలకు అండగా ఉంటానన్నారు.ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.