దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన వస్తు, సేవల పన్ను జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ‘ఒకే దేశం- ఒకే పన్ను’ నినాదంతో కేంద్రం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. దాదాపు 500 రకాల పన్నులన్నీ కలిసి ఒకే పన్నుగా అవతరించాయి. కాగా, జీఎస్టీ అధికారికంగా అమల్లోకి వచ్చిన తేదీని ఏటా ‘జీఎస్టీ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.