ఎన్నికల హామీలో చెప్పినట్టుగా పంజాబ్ నివాస గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల కరెంట్ ను ఉచితంగా ఇస్తున్నట్టు సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. ఈ ఉచిత విద్యుత్ పథకం శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్టు వెల్లడించారు. దేశంలో ఢిల్లీ తర్వాత ప్రజల నివాసాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రెండో రాష్ట్రం పంజాబ్ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa