వీసాల మార్పిడి విసయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లలో పని చేయడానికి వచ్చే వారికి ఇచ్చే వీసాలపై ఇక నుంచి యజమానుల ఆమోదం లేకుండానే మార్చుకునే సౌలభ్యం కల్పించింది. ఫలితంగా మరో చోట పనికి కుదరడం, లేదా స్వదేశానికి వెళ్లడంపై పనికి వచ్చిన వారు సొంత నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు యజమానులు అంగీకరిస్తేనే వీసాను మార్చుకునే వీలుండేది.