మంకీపాక్స్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అలాగే యూరప్‌లో ఈ వ్యాధి వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత రెండు వారాల్లో యూరప్‌లో మూడు రెట్లు కేసులు పెరిగాయని చెప్పింది. మంకీపాక్స్‌ను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. యూఎస్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 51 దేశాల్లో ఇప్పటి వరకు 5 వేల మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.