బిచ్చగాళ్లలా నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు తోబుట్టువులను ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను సత్యబాబా కాలే (40), నిషా (22), సూత్రధారి పూజా కాలే (25)గా గుర్తించారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. వీరంతా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రాంతవాసులు. అచ్చం బిచ్చగాళ్లలా కనిపించేందుకు ఓ చిన్నారిని కూడా తమతో ఉంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.