విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)కి సంబంధించిన కొన్ని నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా సవరించింది. విదేశాలలో ఉండే బంధువుల నుండి ఎటువంటి ఆంక్షలు లేకుండానే, భారతీయులు ఏడాదికి రూ.10 లక్షల వరకు స్వీకరించవచ్చు. ఈ పరిమితి ఇప్పటి వరకు రూ.లక్ష మాత్రమే ఉండేది. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.