పంజాబ్‌లోని మోగా జిల్లాలో తమ 23 ఏళ్ల కుమారుడిని అతడి తల్లిదండ్రులు గొలుసులతో మంచానికి బంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తమ కుమారుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడని, ప్రతి రోజూ రూ.800ల విలువైన డ్రగ్స్ తీసుకుంటున్నాడని వారు వాపోయారు. ఐదేళ్లుగా ఇంట్లో వస్తువులు దొంగిలిస్తున్నాడని, కూలి డబ్బులు మొత్తం డ్రగ్స్‌కే ఖర్చు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బంధించినట్లు చెబుతున్నారు.