అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది. తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్ల చిన్నారిపై గతేడాది ఫిబ్రవరిలో కాళీచరణ్ అనే వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా నివేదికను కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం కాళీచరణ్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు మరణశిక్ష విధించింది.ఖోవై జిల్లా మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa