తాజాగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఫస్ట్ మ్యాచ్ హైలెట్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ యూట్యూబ్ చానళ్లో పెట్టింది. కానీ, రోజంతా అద్భుతమైన గొప్ప ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ఫోటోను పెట్టలేదు. పైగా, పంత్‌ను ఔట్ చేసిన రూట్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ హెడ్ లైన్ చూసిన టీమిండియా సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ 'అంతకుమించిన హెడ్ లైన్ తట్టలేదా అంటూ' ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై సెటైర్స్ వేశాడు.