సత్తెనపల్లి: విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని సీపీఐ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి పి.
ఇర్మియ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa