మన దేశంలో కూడా గే జంటలు పెళ్లిలు పెరిగిపోతున్నాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఇద్దరు పురుషులు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న గే జంట అభిషేక్ రే, చైతన్య శర్మ.. కుటుంబసభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చైతన్య తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయటంతో వైరల్ అయ్యాయి.