దుబాయ్ నుంచి బయల్దేరిన ఎమిరేట్స్ ఎయిర్‌బస్ ఏ 380 విమానానికి గాల్లో ఉండగానే పెద్ద రంధ్రం పడింది. అయినప్పటికీ అది 14 గంటలు నిరాటంకంగా ప్రయాణించి, గమ్యస్థానమైన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ల్యాండ్ అయింది.
టేకాఫ్ అయినప్పుడు పెద్ద శబ్ధం వచ్చి టైర్ పేలిందని భావించినట్లు పైలట్లు చెప్పారు. విమానం ల్యాండ్ అయిన తర్వాతే ఆ రంధ్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. జులై 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.