గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఎక్కువగా గుడ్లు తింటే ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీ పాడయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డులో ప్రొటీన్స్ తో పాటు విటమిన్ ఏ, బీ12, డీ, ఈ వంటివి పుష్కలంగా ఉన్నాయి. రోజుకు రెండు గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేకానీ అంతకంటే ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.