అనంతపురం పోలీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్డడీ సెంటర్ & డిజిటల్ లైబ్రరీ లో 2 వ బ్యాచ్ UPSC CSE-2023 ప్రిలిమ్స్ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ తరగతులు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS నేతృత్వంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా ASR జిల్లా అదనపు ఎస్పీ జి.కృష్ణకాంత్ IPS మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS పాల్గొని ప్రారంభించారు. అనంతరం... ఈ ఇరువురు అధికారులు సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పలు సలహాలు, స్వీయ అనుభవాలు వివరించారు. ప్రిలిమ్స్ , మెయిన్స్ , ఇంటర్వూ ఎలా ప్రిపేర్ కావాలి, ఉన్నత లక్ష్యాన్ని ఎలా అధిగమించాలి... సివిల్ సర్వీసెస్ సాధించడంలో భాగంగా సిలిబస్ పై పట్టు, మిక్ టెస్టులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆప్సనల్ , రీడింగ్ , రైటింగ్, సరైన రివిజన్, ప్రాక్టీస్ , తదితర అంశాలపై క్షుణ్ణంగా అవగాహన చేశారు. కఠోర శ్రమ, పక్కా ప్రణాళిక, సరైన గైడ్లైన్ చాలా అవసరం. నిపుణలచే శిక్షణ తీసుకోవడం ముఖ్యం. డిల్లీ, హైదరాబాద్ , బెంగుళూరు కోచింగ్ సెంటర్లలో దొరకని స్డడీ మెటీరియల్ జిల్లా ఎస్పీ అనంతపురంలో అందుబాటులో ఉంచడం ముదావహం. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు జె.రాంమోహనరావు, నాగేంద్రుడు,హనుమంతు,అనంతపురం ఇన్ఛార్జి DSP ఆర్ల శ్రీనివాసులు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు,పోలీసు పిల్లలు,తదితరులు పాల్గొన్నారు.