చనిపోయిన మేకలు, గొర్రెల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రెస్టారెంట్లకు విజయవాడలో మటన్ మాఫియా సరఫరా చేస్తోంది. ఈ మాంసం మాఫియా కుళ్లిపోయిన, చనిపోయిన జంతువుల మాంసం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు.
విజయవాడలోని కృష్ణలంక తారకరామ నగర్‌కు చెందిన హరిమాణిక్యం రాము ఇంట్లో అక్రమంగా మాంసం నిల్వ ఉంచారని అధికారులకు సమాచారం అందింది. వెంటనే వీఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ తనిఖీ చేసి మాంసాన్ని సీజ్ చేశారు. రాము చనిపోయిన మేకలు, గొర్రెలు తక్కువ ధరకు కొనుగోలు చేసి జంతువుల పొట్టలో పేగులు తొలగించి ఆ స్థానంలో ఐస్ ముక్కలు ఉంచి విజయవాడకు తరలిస్తారని తేల్చారు.
ఆర్డర్లను బట్టి తెచ్చిన ఈ మాంసాన్ని రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. తారకరామానగర్‌లోని ఆయన ఇంటిలో 100 కిలోలకు పైగా చనిపోయిన మేకలు, గొర్రెలు, వాటి తల, మాసం, కాళ్లు పురుగులు పట్టి ఉన్నాయన్నారు. ఎవరైనా ఇలా కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని.. కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల్ని పాటించాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కబేళాలో వ్యాపారం చేసేవారు తప్పనిసరిగా ఆ మాంసంపై వీఎంసీ స్టాంప్ వేయించుకుని విక్రయాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఒక స్టాంప్ వేయించుకుని మిగిలిన వాటికి దాన్నే వాడేస్తున్నారు. గతంలో కూడా అధికారులు త