బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 2 రోజుల క్రితం మెట్లపై నుంచి జారిపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై పరిస్థితి ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ట్విట్టర్లో భావోగ్వేద పోస్టు పెట్టారు. 'నాన్నే నా హీరో. నా బ్యాక్ బోన్. త్వరగా కోలుకో నాన్నా. ఎన్నో అవరోధాలను జయించారు. కోట్లాది ప్రజల అభిమానమే ఆయనకు బలం’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.