జైళ్లలో ఉన్న ఖైదీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జైళ్లలో ఉన్న ఖైదీల శిక్షను తగ్గించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 50 ఏళ్లు దాటిన మహిళలు, ట్రాన్స్జెండర్ ఖైదీలకు కేంద్ర హోంశాఖ శిక్షను తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 60 ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగులైన ఖైదీలకు కూడా జైలు శిక్షను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది.