ముంబైని వరుణుడు వణికిస్తున్నాడు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ముంబై అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, అండర్ పాస్ నుంచి సబ్వేలు పూర్తిగా జలమయం అయ్యాయి. 24 గంటల్లో ముంబైలో 95.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.