నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడిపై అత్యాచారం కేసు నమోదైంది. సమీప బంధువైన 12 ఏళ్ల అమ్మాయి గర్భం దాల్చడంతో బాలుడిపై 376 (అత్యాచారం), పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి గర్భం దాల్చినట్లు చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.