ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ దేశంలోనే అతి పెద్ద నగరమైన సిడ్నీ చాలా వరకూ జలమయం అయ్యింది. భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సిడ్నీలో దాదాపు 50 వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. నిన్నటి రోజు సోమవారం భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో ఏకంగా 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నీట మునిగిన ప్రాంతాల్లో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.