ఏపీలోని విశాఖపట్నంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. నగరంలోని శ్రీహరిపురం శ్మశానంలో తెల్లవారు జామున మగ శిశువు ఏడుపును పారిశుధ్య కార్మికులు విన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలుడిని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.