గుంటూరులో బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపక్కన రిక్షాలు, పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారు నడిపింది ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa