వైసీపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దోచుకున్న సొమ్మును త్వరలోనే ప్రజాలు తిరిగి కక్కిస్తారని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. వాలంటీర్లకు అవార్డుల పేరుతో రూ.485.44 కోట్లను, సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చేందుకు రూ.280 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని యనమల మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa