కనిగిరి: పర్యావరణానికి హాని కల్గిస్తున్న ప్లాస్టిక్ వస్తువులను వాడరాడని మునిసిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. బుధవారం మునిసిపల్ కార్యాలయంలో దుకాణదారుల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను నిషేధించి.. జూట్ ఉత్పత్తులతో తయారుచేసిన సంచులు వాడాలని సూచించారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్స్ నిరోధించాలని.. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.