పేదపిల్లలకి ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దంటూ సీఎం జగన్ రెడ్డి కి లేఖ రాసినట్లు టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలియజేసారు. ఈ లేఖలో..... ఆఘమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనం పేరుతో మీరు తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థుల్ని ప్రభుత్వ విద్యకి దూరం చేస్తోంది. తల్లిదండ్రులు కూలీనాలీ కి వెళితే, మీరు దూరం చేసిన పాఠశాలలకు వాగులు, వంకలు దాటి పిల్లలు ఎలా వెళ్లగలరు? జాతీయ విద్యావిధానాన్ని ఎటువంటి అధ్యయనం లేకుండానే అమలు చేయడంతో 10 వేల స్కూళ్లు మూతపడ్డాయి. మూసేసిన స్కూళ్లు తక్షణమే తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాను. పేదపిల్లలకి ప్రభుత్వ విద్యని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను అని పొందుపరిచినట్లు తెలియజేసారు.