2019 అసెంబ్లీ ఎన్నికలు తర్వాత రోజు నుండి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనసేనపార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ప్రతి ఇంటికి 2019లో జామమొక్కలు,2020లో ఆకుకూర కూరగాయ విత్తనములు,2021లో నిమ్మమొక్కల పంపిణీ ద్వారా జనసేనపార్టీ ని జనంలోకి తీసుకువెళ్లడానికి ,మేము, మా జన సైనికులు ఎంతో కృషి చేశాము అని జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలు వివరిస్తూ.. గత సంవత్సరం జనసేన వనరక్షణ ముగింపు కార్యక్రమం 28-11-21వ తేదీన పిఎసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ జిల్లాఅధ్యక్షులు కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత రోజు 29-11-21 వ తేదీన జనసేన పార్టీని ని మరింత బలోపేతం చేయాలి . పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న బలమైన లక్ష్యంతో నాభార్య శ్రీదేవి నేను మాఇంటిని వదిలి జనం కోసం జనసేన కార్యక్రమం ప్రారంభించి రాత్రిపగలు ప్రజల్లోనే ఉంటూ ప్రతీ గ్రామంలో అక్క చెల్లెమ్మలు పెట్టే అన్నం తింటూ ప్రజల కష్టాలు సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత అధికారులచే సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తూ, పోరాడుతూ,రాత్రి పగలు ప్రజలకు అందుబాటులో అండగా ఉంటూ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన మన జనసైనికుల ఇంటి వద్దనే నిద్రిస్తున్నాము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాకే మా ఇంటికి వెళ్లాలనే లక్ష్యంతో ఈ మహా యజ్ఞం చేస్తున్నాము. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబసభ్యుడిగా ఉండాలని ప్రజలకు అండగా ఉండాలని మా ఇల్లు వదిలి జనం కోసం జనసేన కార్యక్రమం మొదలుపెట్టి నేటికి 220 రోజులు పూర్తి అయింది ఈ క్రమంలో ప్రతి ఇంటి వద్ద ఎన్నో సమస్యలు తెలుసుకోవడం,ఆ సమస్యలు పరిష్కారానికి అధికారులను కలవడం,ప్రజలకు నష్టం కలిగించే పరిష్కారం కాని ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసనలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగిందని తెలియజేసారు.