తాడిపత్రి: పట్టణంలోని కారంజ వారి వీధిలో నివాసం ఉంటున్న బలిజ నాగరాజు (51) రెండు నెలల క్రిందట అనారోగ్యంతో మరణించారు. ఆయనకు ఒక భార్య, కుమార్తె ఉన్నారు. వారి కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలుసుకున్న జనసేన నాయకులు బుధవారం ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ 50 కేజీలు బియ్యం, రెండు నెలల సరిపడ నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు