పేద మైనారిటీల పెళ్లిళ్లకు ప్రభుత్వం తరఫున రూ.50 వేలు అందజేస్తున్న దుల్హన్ పథకంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టారు. ఇటీవల ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. దీనిపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై గురువారం రెండో విడత విచారణ జరిగింది. ఈ పథకాన్ని ఎందుకు ఆపారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.