గోధుమల ఎగుమతులపై గతంలో విధించిన ఆంక్షల్ని తాజాగా దాని ఉత్పత్తులకూ విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. గోధుమ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ గురువారం డీజీఎఫ్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నాణ్యతలోనూ సమస్యలు వస్తున్న తరుణంలో ఈ ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తోందని పేర్కొంది. జులై 12 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసారు.