ఆరేళ్ల బాలుడ్ని ఉపాధ్యాయుడే కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవరియాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్ఖోలి గ్రామానికి చెందిన బాలుడు సంస్కార్ యాదవ్ (6) ని డబ్బుల కోసం కోచింగ్ సెంటర్ టీచర్ కిడ్నాప్ చేసి, బాలుడి కుటుంబ సభ్యులను బెదిరించాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో, విషయం తెలుసుకున్న నిందితులు బాలుడ్ని హత్యచేసి టాయిలెట్లో పడేశారు.