మహారాష్ట్ర రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించిన ఓ రెబల్ ఎమ్మెల్యే ఇప్పుడు పొలంలోకి అడుగుపెట్టారు. గత కొన్ని రోజులుగా లగ్జరీ హోటల్లో గడిపిన పాల్ఘడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగ పొలంలో దర్శనం ఇచ్చారు.ఆయనకు తలసారిలో పంట పొలాలు ఉన్నాయి.అక్కడే ఆయన తల్లి,భార్య,14 ఏళ్ల కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. పాల్ఘడ్లో వర్షాలు సాగుకు అనుకూలంగా కురుస్తున్నాయి. దింతో హోటల్ నుండి ఇంటికి రాగానే వ్యవసాయంలోకి దిగారు.