శరీశైల శిఖరం చూడటం వల్ల ముక్తి కలుగుతుంది. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ఇతర క్షేత్రాలలో తపస్సు చేస్తే ముక్తి కలుగుతుంది. కాని "ధర్మకుండం" పేరు తలచుకున్నంత మాత్రం చేతనే మోక్షం కలుగుతుంది అని ప్రతీతి.
వేములవాడ క్షేత్రంలో వుంది ఈ ధర్మకుండం కోనేరు. తరేతాయుగంలో దక్షుడు గంధమాదన పర్వతంపై యజ్ఞం చేయగా, శివ యజ్ఞ భాగలేమితోయున్న మంత్రపూతమైన హవిష్యమును సూర్యుడు తీసుకున్నాడుదక్షుడి యజ్ఞానికి వెళ్లి అక్కడ వీరభద్రునిచే చేతులు నరకబడ్డ సూర్యుడు ఈ ధర్మకుండంలో స్నానంచేసి చేతులను తిరిగి పొందాడట అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని పేరు వచ్చినట్లు పురాణాంతర్గత కథనం. ఇలా ఈ కొనేటి మహిమను ప్రస్తుతించే కథలెన్నో వున్నాయి.
దండకారణ్య ప్రాంత సంచారణ సమయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు, అరణ్యవాసంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్లు, స్వామివారి కృపకు పాత్రులైనట్లు స్థలపురాణ విదితం.
కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనo
వములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా పిలువబడుతు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజన్న క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకున్నది.
దన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. సథల పురాణాలను బట్టి అర్జునుని మనుమడు నరేంద్రుడు పొరపాటున లేడి అనుకొని ఒక ఋషిని చంపాడట. అతనికి కల్గిన పాపం ఎన్ని పూజలు చేసినా పోలేదు. అలా తిరుగుతూ దప్పికయి ధర్మకుండంలో దిగి దోసిటతో నీరు త్రాగగానే పాపపరిహారం జరిగిందట. అప్పుడు స్వామి అతనికి కలలో కన్పించి ధర్మకుండం అడుగున రాజేశ్వర రూపంలో తాను వున్నానని, తీసి ధర్మకుండం వొడ్డున ప్రతిష్ఠించవలసిందని ఆనతిచ్చాడు. నరేంద్రుడు అలాగే నిర్మించాడట ఈ ఆలయాన్ని.
మళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి.
వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో ఉంది.
ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అని పేరు వచ్చింది.
ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.
పరధాన వేడుకలు:
ఆలయంలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడురోజులపాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. సుమారు 5-6 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఆపై శ్రీరామనవమి సందర్భంగా జరిగే శివ కల్యాణోత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. పదివేలమంది హిజ్రాలు, 25 వేల మంది శివపార్వతులు శ్రీరామనవమి రోజున శివుడిని పెళ్లాడతారు. అలాగే.. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, దసరా నవరాత్రోత్సవాలూ ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. మాస శివరాత్రి, ఏకాదశి రోజున స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశిపూజ, మహాలింగార్చన చేస్తారు.
ఆలయ ప్రత్యేకత :
భారతదేశమునందు ఏ క్షేత్రములో లేని సాంప్రదాయము ఇక్కడ వుంది. అది 'అద్దె కోడెలను కట్టుట'. పిల్లలు పుట్టని దంపతులు పిల్లలు కలగాలని స్వామి వారికి మొక్కుకొని, పిల్లలు కలిగాక ఆ బాలునితో, ఒక కోడె దూడను తెచ్చి, ఆలయం చుట్టు తిప్పి ముందున్న స్థంబానికి కట్టి వెళతారు.
దీన్నే కోడే మొక్కు అంటారు.
కోడే దూడను తెచ్చుకోలేని దూర ప్రాంతం వారి సౌకర్యార్థం ప్రస్తుతం ఇక్కడ ఆ సమయానికి కోడే దూడలను అద్దెలకు ఇస్తారు.
మహా శివ రాత్రి వంటి పర్వ దినాలల్లో కోడే మొక్కు చెల్లించుకొనే వారి సంఖ్య వేలలో వుండడాన్ని బట్టి చూస్తే ఈ ఆలయ ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలుస్తుంది.
అదే విధంగా స్వామివారికి బెల్లం సమర్పించడం కూడ ఇక్కడున్న మరో ఆచారం.
మరెక్కడాలేని మరో ఆచారం కూడ ఇక్కడ మరొకటి వున్నది.
అదే... రోగాల బారిన పడిన లేక ఇతర కష్టాల బారిన పడిన స్త్రీలు రాజరాజేశ్వరునికి మొక్కుకొని అవి తీరాక ఆది బిక్షువు అడుగు జాడల్లోనే జీవితాంతం బిక్షాటనె వృత్తిగా చేసుకొని, మహా శివునికే అంకితమై పోతారు.
అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో వుంటారు.