పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైడ్రోజన్‌తో నడిచే రైలు 2023 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. దీనిపై తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్బన ఉద్గారాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు రైల్వే చర్యలు చేపట్టినట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ఈ చర్య దోహదపడుతుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలెక్కుతుందన్నారు.