వాట్సాప్లో కీలక సంభాషణలను రికార్డు చేయాలని చాలా మందికి ఉంటుంది. అదెలాగో తెలియక తికమక పడుతుంటారు. గూగుల్ ప్లే స్టోర్లో లభించే క్యూబ్ ఏసీఆర్ యాప్ సాయంతో వాట్సాప్ కాల్ రికార్డ్ చేయొచ్చు. ఈ యాప్ను ఓపెన్ చేసి, రన్నింగ్లో ఉంచాలి. ఆ తర్వాత వాట్సాప్ కాల్ చేయాలి. ఇలా మీరు మాట్లాడిన వాట్సాప్ కాల్స్ అన్నీ రికార్డు చేసుకోవచ్చు. అయితే సైబర్ భద్రతపై యూజర్లు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.