మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని ఆహ్వానిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసింది.
సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షను కూడా సవాలు చేసింది.అనర్హత వేటు పడిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున బలపరీక్ష చట్టవిరుద్ధమని పేర్కొంది.