చూడగానే నోరూరించే పనస పండు తొనలను ఇష్టపడని వారు ఉండరు. అయితే పనస గింజల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియంతో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా రక్తహీనత దూరం అవుతుంది. అంతే కాకుండా జీర్ణసమస్యలు, కంటి సమస్యలు రావు. ఇవి తరచూ ఉడకబెట్టుకుని తింటుంటే దంతాలు, ఎముకలు, జట్టు దృఢంగా తయారవుతాయి. చర్మం సౌందర్యం పెంపొందిస్తుంది.