ఇంగ్లాండ్‌తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో ఇండియా దుమ్మురేపిన విషయం తెలిసిందే. 50 పరుగుల తేడాతో బంపర్ విక్షర్ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత టీమ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల కోల్పోయి 198 పరుగులు చేసింది.
అయితే ఇంగ్లాండ్‌కు ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు. ఆ టీమ్ ఆటగాళ్లు ఇప్పుడు పరుగుల దాహంతో ఉన్నారు. నెక్ట్స్ లెవల్‌లో రాణిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కాసేపు నిలబడి ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేంది. అతడు గతంలో ఆడిన పలు విధ్వంసకర ఇన్సింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. భువీ వేసిన ఇన్ స్వింగర్‌కు జోస్ బట్లర్ స్టన్ అయ్యాడు. భువి నుంచి వచ్చేవి.. బంతులా.. బంతులా అన్నది అర్థం కాని పరిస్థితి. 3 ఓవర్లు వేసిన భువీ.. కేవలం 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
బాలర్లను ఊచకోత కోసే జాసన్ రాయ్, బట్లర్ వంటి హిట్టర్లను క్రీజ్‌లో పెట్టుకొని మరీ కేవలం 4 పరుగులు ఇచ్చాడంటే భువనేశ్వర్ ఏ రేంజ్‌లో బౌలింగ్ వేశాడో అర్థం అవుతుంది. భారత బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరికి ఇంగ్లాండ్ 148 పరుగులకే కుప్పకూలింది. బట్లర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన భువీ ఇన్‌స్వింగర్ డెలివరీపై మీరూ ఓ లుక్కేయండి.