పొత్తి కడుపు కండర గాయంతో వింబుల్డన్ నుంచి వైదొలగుతున్నట్టు రఫా గురువారం ప్రకటించాడు. దీంతో శుక్రవారం సెమీఫైనల్లో నడాల్‌తో తలపడాల్సిన ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిరియోసకు వాకోవర్ లభించింది. క్వార్టర్‌ఫైనల్లో రెండో సెట్‌లో గాయంతోనే నడాల్ టైమవుట్ తీసుకున్నాడు. ఆ టైంలో డాక్టర్ నడాల్‌కు నొప్పి తగ్గే మాత్రలు ఇచ్చారు. బాధను భరిస్తూనే నడాల్ ఆటను ముగించాడు. ఆ గాయం మానకపోవడంతో పోటీ నుండి తప్పుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa