వైసిపి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన విషయాన్ని ఇప్పటికీ గుర్తించడం లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. చంద్రబాబును దూషిస్తూ పబ్బం గడుపుకున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక స్థితి గతులు పతనావస్థలో ఉంటే, ఆ విషయాలేవీ ప్రస్తావించకుండా, ప్రజలను మభ్య పెట్టడం కోసం ప్రయత్నం చేశారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ప్లీనరీలో ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రజల సమస్యలను ప్రస్తావించాలని, ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికను తెలియజేయాలని వర్ల రామయ్య వైసీపీ నేతలకు గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa