జగమంత కుటుంబం నాది అంటూనే మరో పక్క ఏకాకి జీవితం నాది అంటుంటే... ఆ సెంటిమెంటులో స్క్రిప్ట్ ఒకటి సీన్ ఇంకొకటి అని అనిపించిందేమో... జనాలకి నచ్చక ఖాళీ కుర్చీలను వినేసి రమ్మని వెళ్లిపోయారు అని నిన్న జరిగిన వైసీపీ ప్లీనరీ ని ఉద్దేశించి టీడీపీ వర్గీయులు హేళన చేసారు. వేదికపై జగన్ రెడ్డి, వారి తల్లి విజయమ్మ గారు ఉండగా వైకాపా రాష్ట్ర ప్లీనరీ సభ ఇలా జనం లేక బోసిపోయింది అని వాపోయారు. మరి వైసీపీ వారు మాత్రం మేము అనుకున్న దాని కన్నా ప్రజాదరణ ఇంకా ఎక్కువగానే కనిపించింది అని ధీమా వ్యక్తపరుస్తున్నారు. కానీ ప్లీనరీ సమావేశంలో విజయమ్మ తీసుకున్న రాజీనామా నిర్ణయం మాత్రం కొంత వరకు వైసీపీ పార్టీకి లోటు చేస్తుందని చెప్పవచ్చు.