జూలై 10 న బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ జీవిత సత్యాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
ఈ పండుగ త్యాగం, సత్యం విలువను చాటుతుందని తెలిపారు. జీవితంలో మనిషికి ఎదురైన కష్ట నష్టాలను ఎదుర్కొంటూ సత్యం కోసం నిలబడితే మంచి జరుగుతుందని బక్రీద్ పండుగ ద్వారా తెలుసుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa