కందుకూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయల అవినీతి సాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు.
ఆదివారం మండలంలోని చిమిడిదెపాడు గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట్ల రూపాయల అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్ నియంతృత్వ పాలన అంతానికి టీడీపీ కంకణం కట్టాలని పిలుపునిచ్చారు.