మధ్యప్రదేశ్లోని మోరెనా వద్ద హృదయవిదారక ఘటన జరిగింది. అంబాహ్లోని బద్ఫ్రా గ్రామంలో పూజారాం జాతవ్ చిన్న కుమారుడు రాజాకు అనారోగ్యం వచ్చింది. అతడిని మోరెనా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ శనివారం బాలుడు మరణించాడు. ఆసుపత్రి అధికారులు అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రాజా మృతదేహాన్ని అతడి అన్న గుల్షన్ తన ఒడిలో పెట్టుకుని, రోడ్డుపక్కన తండ్రితో కూర్చోవడం పలువురిని కదిలించింది.