సామాజిక కార్యకర్త, 'నర్మదా బచావో' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌పై మధ్యప్రదేశ్‌లో ఆదివారం కేసు నమోదైంది. గిరిజన పిల్లల చదువుల పేరుతో నర్మదా నవనిర్మాణ అభియాన్ ట్రస్ట్‌కు చెందిన రూ.13 కోట్లను దుర్వినియోగం చేశారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రీతమ్ ఫిర్యాదు చేశారు. డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సమకూరుస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆమెతో పాటు మరో 11 మందిపై కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.